భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే సమరం శుక్రవారం ప్రారంభమైంది. రాజ్‌కోట్‌లోని మాధవరావు సింథియా క్రికెట్ మైదానంలో ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ వన్డే సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఓపెనర్లుగా టీం ఇండియా వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లు బ్యాటింగ్‌కు దిగారు.
వీరేంద్ర సెహ్వాగ్, 38 బంతుల్లో ఆరు ఫోర్లతో 37 పరుగులు చేయగా, గౌతం గంభీర్ 52 బంతుల్లో ఏడు ఫోర్లు సాధించి 45 పరుగులు చేశాడు. దీంతో వీరూ, గంభీర్‌లు అర్థశతకం వైపు పయనిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు 15 ఓవర్లలో 90 పరుగులు చేసింది.