నాగ్‌పూర్‌లో ఆరంభమైన రెండో వన్డేలో భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సెహ్వాగ్ 31 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. ఇందులో ఆరుఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.
అలా.. ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న సెహ్వాగ్‌కు ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అడ్డుకట్ట వేశాడు. అద్భుతమైన బంతిని సంధించగా, బౌండరీకి తరలించే ప్రయత్నంలో హిల్ఫెన్హౌస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు దారి పట్టాడు. అప్పటికి భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు.
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ సింగ్ కూడా ధాటిగా ఆరంభించడంతో భారత్ 14 ఓవర్లలో 88 పరుగులు చేసింది. క్రీజ్‌లో గంభీర్ (23), యువరాజ్ (17)లు ఉన్నారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక్క ఫోర్ కొట్టి సైడిల్ బౌలింగ్‌లో వైట్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.