ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా ట్రినిడాడ్ చేతిలో ఖంగుతిన్న చెన్నై సూపర్ కింగ్స్ సెమీఫైనల్ అవకాశాలు మందగించాయి. మంగళవారం న్యూ సౌత్‌వేల్స్ జట్టులో గెలుపొందడంతో పాటు ఏదైనా అద్భుతం జరిగేతేనే చెన్నై సూపర్ కింగ్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించినట్లవుతుంది. ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 ఓవర్ క్రికెట్‌లో ఐపీఎల్ నాలుగో సీజన్ ఛాంపియన్ చెన్నై 'ఎ' గ్రూపులో స్థానం దక్కించుకుంది. ఇదే గ్రూపులో కేప్ కోబ్రాస్, ముంబై ఇండియన్స్, న్యూసౌత్‌వేల్స్, ట్రినిడాడ్ టొబాగో జట్లు కూడా స్థానం సంపాదించాయి.
ఈ నేపథ్యంలో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో కేప్ కోబ్రాస్‌ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. అయితే సోమవారం జరిగిన మూడో మ్యాచ్‌లో మాత్రం ట్రినిడాడ్ జట్టు చేతిలో చెన్నై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
కాగా, మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ న్యూ సౌత్ వేల్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ నేటి రాత్రి 8 గంటలకు చేపాక్కం స్టేడియంలో జరగనుంది. చెన్నై జట్టు మూడు మ్యాచ్‌ల్లో ఒక ఓటమి, రెండు పరాజయాలతో రెండు పాయింట్లు సాధంచింది. రన్ రేటు -0.081 కలిగివుంది. తద్వారా ఛాంపియన్స్ లీగ్ పట్టికలో చివరి స్థానంలో ఉంది. తద్వారా చెన్నైకి సెమీఫైనల్ అవకాశాలు తక్కువేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా చెప్పాలంటే న్యూసౌత్ వేల్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తప్పనిసరిగా భారీ పరుగుల ఆధిక్యంలో గెలిచితీరాలి. అలాగే కేప్ కోబ్రాస్-ట్రినిడాడ్‌ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్‌లో తొలుత కేప్ కోబ్రాస్ ఓడాలి. ఇవన్నీ జరిగితేనే చెన్నై సూపర్ కింగ్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమమవుతుంది. లేదంటే ధోనీసేన ఛాంపియన్స్ లీగ్ నుంచి నిష్క్రమించినట్లే అవుతుంది. మరి చెన్నై ఏ మేరకు రాణించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుందో వేచి చూడాలి.