చెన్నయ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు లంచ్ వేళకు వికెట్ నష్టపోకుండా 27 ఓవర్లలో 63 పరుగులు చేసి పటిష్టంగా నిలిచింది. ఇంగ్లండ్ జట్టు ఓపెనర్లు స్ట్రాస్ -80 బంతుల్లో 31 పరుగులు- కుక్ 82 బంతుల్లో 31 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నారు.
వికెట్ నిలుపుకోవడానికి ఓపెనర్లు ప్రాధాన్యం ఇవ్వడంతో రన్ రేట్ పడిపోయింది. వర్షం కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేకపోవడంతో ఇంగ్లండ్ జట్టు ప్రారంభంలో కుదురుగా నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది.
భారత్ గెలిస్తే టెస్టు ర్యాంకుల్లో రెండో స్థానానికి, ఇంగ్లండ్ గెలిస్తే వన్డే పోటీల్లో పోయిన పరువు నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఉన్న నేపధ్యంలో ఇరు జట్లు మొదటి టెస్టును ఆషామాషీగా తీసుకోవట్లేదు. అయితే స్వదేశంలో కొరకరాని కొయ్య అయిన భారత్‌తో పోలిస్తే తాము ఈ టెస్ట్ సీరీస్‌లో అండర్ డాగ్స్ గానే బరిలో దిగుతున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రకటించడం గమనార్హం.