Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడ్ షాట్లతో అర్థశతకం సాధించిన యువరాజ్

Advertiesment
గుడ్ షాట్లతో అర్థశతకం సాధించిన యువరాజ్
వెన్ను నొప్పితో బెల్టు కట్టుకుని మైదానంలో దిగిన భారత బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ 5 ఫోర్లతో అర్థశతకం దాటాడు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ పది ఫోర్లతో, గౌతం గంభీర్ 8 ఫోర్లతో అదరగొట్టారు. వెన్నునొప్పితో పరిగెత్తి పరుగులెత్తకపోయినా యువీ బెరన్నర్ సాయంతో ఐదు ఫోర్లతో 61 పరుగులు చేశాడు.

యువరాజ్‌కు గట్టి భాగస్వామ్యాన్నిచ్చిన రైనా 43 పరుగులకే ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో కాలింగ్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి స్థానంలో బరిలోకి దిగిన పఠాన్ ఓ పరుగు కూడా చేయకుండా హార్మిసన్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం ధోని (12 పరుగులు), యువరాజ్‌ (61)లతో క్రీజులో ఉన్నారు. దీంతో భారత్ 40.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu