క్రైస్ట్‌చర్చ్‌లోని ఏఎంఐ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో పర్యాటక భారత జట్టు ఆతిథ్య జట్టు ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మెక్‌కలమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ఓపెనర్ సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లో మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు.
133 బంతులు ఎదుర్కొన్న సచిన్ 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 163 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సెంచరీతో భారత భారీస్కోరులో కీలక పాత్ర పోషించిన సచిన్‌తోపాటు, మిడిల్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ (10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు) కూడా కివీస్ బౌలర్లకు చెమటలు పట్టింది. చివర్లో సురేష్ రైనా ఐదు సిక్స్‌లతో 38 పరుగులు జోడించి భారత్‌కు స్కోరును 400 పరుగుల మైలురాయికి చేరువ చేశాడు.
కివీస్ బౌలర్లలో మిల్స్ (2 వికెట్లు), ఓరమ్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పిటికీ, మిగిలిన బౌలర్లు భారత్ బ్యాట్స్‌మెన్‌కు దాసోహమన్నారు. బట్లర్, ఇలియట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. వన్డే సిరీస్‌లో ఇప్పటికే టీం ఇండియా 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. మూడో వన్డేలోనూ ప్రత్యర్థి ముందు టీం ఇండియా భారీ లక్ష్యాన్ని ఉంచి, విజయావకాశాలను పదిలంగా ఉంచుకుంది.