శ్రీలంకతో జరుగతున్న మూడో వన్డేలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ వీరవిహారం చేస్తున్నాడు. గంభీర్ అవుట్ అయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ సింగ్ లంక బౌలర్లపై సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో అర్థసెంచరీని పూర్తి చేసుకున్న యూవీ.. ఆతర్వాత మరింత రెచ్చిపోయి లంక బౌలర్లకు పగటి పూట చుక్కలు చూపించి, కెరీర్‌లో 39 హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
మరో ఎండ్‌లో ఉన్న డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ నింపాదిగా ఆడారు. అంతకుముందు టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే. సెహ్వాగ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్ మరోమారు విఫలమయ్యాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన గంభీర్ కూడా పది పరుగులకే రనౌట్ అయ్యాడు.
అనంతరం సెహ్వాగ్‌తో జతకలిసిన యువరాజ్ సింగ్.. లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 75 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, తొలి వికెట్ తొమ్మిది పరుగుల వద్ద, రెండో వికెట్ 24 పరుగుల మీద పడింది. ఫెర్నాండో తొలి వికెట్ తీశాడు.