Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీల్ మెకంజి ప్రొఫైల్

నీల్ మెకంజి ప్రొఫైల్
FileFILE
దక్షిణాఫ్రికా జట్టుకు లభించిన పటిష్టమైన నిలకడ కలిగిన ఓపెనర్, మిడిల్ ఆర్డర్‌లో కూడా రాణించ గలిగే సత్తా కలిగిన క్రికెటర్ నీల్ మెకంజీ. 2000 సంవత్సరంలో దక్షిణాకా జట్టు తరపున మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా రంగప్రవేశం చేశాడు. అయితే.. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్‌గా కొత్త అవతారం ఎత్తాడు.

మంచి క్రికెట్ నేపథ్యాన్ని కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు. 2000-01 సీజన్‌లోనే శ్రీలంక, న్యూజీలాండ్ పర్యటనల్లో సెంచరీలు చేసి, తన సత్తా చాటాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని తన జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌తో కలిపి నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యంగా 415 పరుగులు చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. ఈ టెస్ట్‌లో నీల్ మెకంజీ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

పూర్తి పేరు.. నీల్ డంగ్లస్ మెకంజీ.
పుట్టిన తేది.. 1975 నవంబరు 24.
ప్రస్తుత వయస్సు.. 32 సంవత్సరాలు.
ప్రధాన జట్లు.. దక్షిణాఫ్రికా, డుర్హమ్, గాటెంగ్, లయన్స్, ట్రాన్స్‌వాల్.
బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ్ మీడియం.
టెస్టులు.. 47. చేసిన పరుగులు.. 2649, సెంచరీలు.. 4, అర్థ సెంచరీలు 14. అత్యధిక స్కోరు.. 226.
వన్డేలు.. 59. చేసిన పరుగులు.. 1580. సెంచరీలు.. 2, అర్థసెంచరీలు.. 9. అత్యధిక స్కోరు.. 131 (నాటౌట్).

టెస్ట్ అరంగేట్రం.. శ్రీలంకపై, జులై 20-23. గాలే.
వన్డే అరంగేట్రం.. జింబాబ్వేపై, 2000 ఫిబ్రవరి 2, డర్బన్.
(నోట్: 14.07.2008 నాటికి అందుబాటులోని గణాంకాలు.)

Share this Story:

Follow Webdunia telugu