Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'టీమ్ ఇండియా'కు మరో ఆణిముత్యం.. గంభీర్

'టీమ్ ఇండియా'కు మరో ఆణిముత్యం.. గంభీర్
, శనివారం, 19 జులై 2008 (18:26 IST)
'టీమ్ ఇండియా'కు దొరికిన మరో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్. గత 2000 సంవత్సరంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ ఢిల్లీ ఓపెనర్‌కు పెద్దగా కలసి రాలేదు. గత ప్రపంచ కప్‌ అనంతరం 2003లో సీనియర్ ఆటగాళ్ళ గైర్హాజరీతో ఢాకాలో జరిగిన టీవీఎస్ కప్‌లో చోటు లభించింది. ఈ టోర్నీలో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి, తన సత్తాను చాటాడు. ముఖ్యంగా 2004-05 సంవత్సరంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గంభీర్ పరుగుల వరద పారించాడు.

ఆ తర్వాత 2007లో జరిగిన వరల్డ్‌కప్‌లో భారత్ పేలవమైన ప్రదర్శన చూపింది. అనంతరం బంగ్లాదేశ్‌‌లో జరిగిన వన్డే సిరీస్‌లోనూ, దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లోనూ గంభీర్ అద్భుత ప్రతిభ చూపారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా గంభీర్ రికార్డు సాధించాడు.

ట్వంటీ-20లో నాలుగు అర్థసెంచరీలు, పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 75 పరుగులు చేసిన పరుగులతో గంభీర్‌తో తన పేరును 'టీమ్ ఇండియా'లో సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌లలో రాణించ లేకపోయినా, ఐపీఎల్ టోర్నీలో మాత్రం గంభీర్ పరుగులు గుమ్మరించాడు. ఈ టోర్నీలో మొత్తం 440 పరుగులు చేశాడు.

పూర్తి పేరు.. గౌతం గంభీర్.
పుట్టిన తేది.. అక్టోబర్ 14, 1981.
పుట్టిన ప్రాంతం.. ఢిల్లీ, న్యూఢిల్లీ.
ప్రస్తుత వయస్సు.. 26 సంవత్సరాల, 279 రోజులు.
ఆడే జట్లు.. భారత్, ఢిల్లీ, ఢిల్లీ డేర్ డెవిల్స్, ఇండియా రెడ్, ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ XI.
బ్యాటింగ్ స్టైల్.. ఎడమచేతి వాటం.
బౌలింగ్ శైలి.. లెగ్ బ్రేక్.
ఆడిన టెస్టులు.. 14, మొత్తం పరుగులు.. 692. సగటు... 32.95
ఆడిన వన్డేలు.. 56. మొత్తం పరుగులు 1,951. సగటు... 39.02
అత్యధిక పరుగులు... 139 (టెస్టుల్లో), 113 (వన్డేలు)

అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం..
టెస్టుల్లో... 2004 నవంబర్ 3-5 ముంబాయిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌.
వన్డేల్లో... 2003 ఏప్రిల్ 11వ తేదీన ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌.

Share this Story:

Follow Webdunia telugu