Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"అజంతా మెండీస్" రికార్డు భలే...!

శ్రీలంకకు చెందిన స్పిన్ బౌలర్ అజంతా మెండిస్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన 50వ వికెట్‌ను పడగొట్టిన మెండిస్, అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఘనతను సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

భారత్‌కు చెందిన అజిత్ అగార్కర్ 23 మ్యాచ్‌లలో 50 వికెట్లు పడగొట్టగా, మెండిస్ 19 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును సృష్టించడం గమనార్హం. దీంతో తక్కువ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు సాధించిన జాబితాలో అజంతా తొలిస్థానంలో నిలవగా, అగార్కర్ రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో లిల్లీ (24 మ్యాచ్‌లు), నాలుగో స్థానంలో వార్న్ (25 మ్యాచ్‌లు), ఐదో స్థానంలో పాస్కోయ్ (26 మ్యాచ్‌లు) నిలిచారు.

ఇదిలా ఉండగా... బంగ్లాదేశ్‌లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మెండిస్, కులశేఖర చెరో మూడు వికెట్లు పడగొట్టి... శ్రీలంక విజయానికి తోడ్పడ్డారు. అదేవిధంగా... ముత్తయ్య మురళీధరన్ రెండు వికెట్లు పడగొట్టి జింబాబ్వేను కష్టాల్లోకి నెట్టి... లంకకు గెలుపు బాటలో నడిపించారు.

బౌలింగ్‌లోనే అజంతా మేటి...
1985వ సంవత్సరం, మార్చి 11వ తేదీన శ్రీలంకలోని మోరతువాలో జన్మించిన మెండిస్‌కు ప్రస్తుతం 23 సంవత్సరాల 308 రోజులు. శ్రీలంక, కొల్‌కతా నైట్ రైడర్స్, శ్రీలంక ఆర్మీ, వయాంబా జట్టుల్లో రాణించిన ఈ బౌలర్... కుడిచేతి వాటం బ్యాటింగ్ చేయగలడు. అంతేగాకుండా... ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేస్తాడు.

అయితే... ఇప్పటి వరకు నాలుగు టెస్టు మ్యాచ్‌లు, 19 వన్డేలు, మూడు ట్వంటీ-20లు ఆడిన అజంతా... పరుగుల సాధనలో మాత్రం ఎలాంటి రికార్డును సొంతం చేసుకోలేదు.

కానీ... బౌలింగ్‌లో అత్యద్భుతంగా రాణించిన అజంతా మెండిస్ ఇప్పటి వరకు... కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లోనే.. 33 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 19 వన్డేల్లో... 51 వికెట్లను సాధించి రికార్డు సృష్టించాడు. మరోవైపు 3 ట్వంటీ-20 మ్యాచ్‌లలో 11 వికెట్లు సాధించి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

బ్యాటింగ్‌లో నిలదొక్కుకోక పోయినా... బౌలింగ్‌లో ప్రత్యర్థి గుండెల్లో గుబులు పుట్టించే అజంతా మెండీస్... ఇంకా కెరీర్‌లో రికార్డులు సృష్టించాలని ఆశిద్దామా...?

Share this Story:

Follow Webdunia telugu