శ్రీలంక జట్టులో తాజా సంచలనంగా పేరు తెచ్చుకున్న అజంత మెండీస్ తన బౌలింగ్ విన్యాసాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం భారత్, శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో తన విశ్వరూపం చూపిన మెండీస్ వర్ధమాన క్రికెటర్‌గా తాజా ఐసీసీ అవార్డును సైతం చేజిక్కించుకున్నాడు.
స్పిన్ బౌలర్‌గా శ్రీలంక జట్టుకు చాలాకాలంగా సేవలందిస్తున్న ముత్తయ్య మురళీధరన్ స్థానాన్ని భర్తీ చేయగల సమర్ధుడిగా ఎదుగుతున్న మెండీస్ ప్రొపైల్ మీకోసం...
పూర్తి పేరు ... అజంత విన్స్లో మెండీస్
పుట్టిన తేదీ ... మార్చి 11, 1985 (మొరటువా)
బ్యాటింగ్ శైలి ... కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి ... రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్, లెగ్‌బ్రేక్
వన్డే అరంగేట్రం ... ఏప్రిల్ 10 2008 (వెస్టీండీస్తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్‌తో)
ఇప్పటివరకు ఆడిన వన్డేలు (బౌలింగ్) ... 13 వన్డేలు (12 ఇన్నింగ్స్‌లు)
తీసిన వికెట్లు ... 33
ఇప్పటివరకు ఆడిన వన్డేలు (బ్యాటింగ్) ... 13 (ఏడు ఇన్నింగ్స్‌లు)
చేసిన పరుగులు ... 54
టెస్టు అరంగేట్రం ... జులై 2008 (కొలంబోలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో)
ఇప్పటివరకు ఆడిన టెస్టులు (బౌలింగ్) ... 3 (ఆరు ఇన్నింగ్స్‌లు)
తీసిన వికెట్లు ... 26
ఇప్పటివరకు ఆడిన టెస్టులు (బ్యాటింగ్) ... 3 (మూడు ఇన్నింగ్స్‌లు)
చేసిన పరుగులు ... 19