Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హామిల్టన్ టెస్ట్: 520 పరుగులకు భారత్ ఆలౌట్

Advertiesment
క్రీడలు క్రికెట్ వార్తలు హామిల్టన్ టెస్ట్ 520 పరుగులు భారత్ ఆలౌట్ సచిన్ ధోనీ జహీర్ ఖాన్ సెహ్వాగ్
న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 520 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్‌పై టీం ఇండియాకు 241 పరుగుల ఆధిక్యం సాధించినట్లైంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 279 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఇకపోతే.. 278/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ 242 పరుగులు జోడించి, మిగతా వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (260 బంతుల్లో 26 ఫోర్లతో 160 పరుగులు) ధీటుగా రాణించి, మరో శతకాన్ని సాధించాడు. సచిన్ తర్వాత టీం ఇండియా ఆటగాళ్లలో గౌతం గంభీర్ 72 పరుగులు చేసి శతకాన్ని చేజార్చుకున్నాడు.

లోయర్ ఆర్డర్‌లో ఆడిన జహీర్ ఖాన్ అర్థసెంచరీని ( 46 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులు) నమోదు చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు. అయితే వన్డేల్లో రాణించిన సెహ్మాగ్ 24 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. ఇదేవిధంగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 47 పరుగులు మాత్రమే చేసి అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ (33), యువరాజ్ సింగ్ (22), హర్భజన్ సింగ్ (16), ఇషాంత్ శర్మ (6), మునాఫ్ పటేల్ (9) పరుగులు చేశారు.

కివీస్ బౌలర్లలో మార్టిన్, ఒబ్రియాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా, వెటోరి రెండు, మిల్లిస్ ఒక వికెట్ సాధించారు.

Share this Story:

Follow Webdunia telugu