హామిల్టన్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ఆ జట్టు ఓపెనర్ కటిచ్ (106) సెంచరీ చేయడంతో తొలి టెస్టు మూడో రోజు ఆటముగిసే సమయానికి 333 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు ఇప్పటి వరకు 300 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
ఈ టెస్టు తొలిరోజున టాస్ గెలిచిన ఆసీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై 33 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు వాట్సన్ (65), కటిచ్ (106)లు రాణించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వాట్సన్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ రికీ పాంటింగ్ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.
అయితే, ఆ తర్వాత కటిచ్‌తో జతకలిసిన మైక్ హుస్సే (67) అర్థ సెంచరీతో రాణించారు. అదే సమయంలో కటిచ్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు అవుట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన క్లార్క్ (42), నార్త్ (42) పరుగులతో మూడో రోజు నాటౌట్‌గా నిలిచారు. కివీస్ బౌలర్లలో సౌథీ, ఆర్నెల్‌లు రెండేసి వికెట్లు తీయగా, కెప్టెన్ వెట్టోరికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు.