వెస్టిండీస్‌తో కరేబియన్ గడ్డపై జరగాల్సిన టెస్టు సిరీస్‌లో ఆడేందుకు వెళ్లిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అంజాద్ ఖాన్ స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. మోకాళ్ల గాయం కారణంగా ఈ పర్యటన నుంచి అంజాద్ ఖాన్ తప్పుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో, అంజాద్ మోకాలి గాయంతో బాధపడ్డాడు.
అంజాద్ స్కాన్ రిపోర్టును పరిశీలించిన అంజాద్ మైదానంలోకి దిగి ఆడటం మంచిది కాదని వైద్యులు పేర్కొన్నారు. అంతేగాకుండా అంజాద్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఈ ఫాస్ట్ బౌలర్ ఇంటిముఖం పట్టాడు.
ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ జట్టుకు ఆండ్రూ ఫ్లింటాఫ్, రియాన్ సైడ్‌బాటమ్ గాయాల కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో జట్టులోకి ప్రవేశించిన అంజాద్ కూడా అదే కారణంతో ఈ 28 ఏళ్ళ బౌలర్, అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లలో 29 ఓవర్లకు బౌలింగ్ చేసి, 1-111 సగటుతో స్వదేశానికి చేరుకోనున్నాడు.