Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబరులో ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్

Advertiesment
ఛాంపియన్స్ లీగ్
FILE
ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌ వచ్చే సెప్టంబరు పదో తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వివాదంలో చిక్కుకున్న నలిగిపోతున్న ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ తన విధులను మాత్రం యధా విధిగా నిర్వహిస్తున్నారు. ఈ వివాదాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన ముందుకు సాగిపోతున్నారు.

ఇందులోభాగంగా.. ఆయన ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ వచ్చే సెప్టెంబరులో దక్షిణాఫ్రికాలో జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లీగ్‌కు ఆతిథ్యం ఇస్తామని క్రికెట్ సౌతాఫ్రికా నుంచి వచ్చిన విజ్ఞప్తిని గవర్నింగ్ కౌన్సిల్ అంగీకరించింది. కాగా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి లలిత్ మోడీ హాజరుకాలేదు.

Share this Story:

Follow Webdunia telugu