భారత పరుగుల యంత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ ట్వంటీ-20 టోర్నమెంట్‌కు దూరంగా ఉండటం ఇతర జట్లకు మేలు చేస్తుందని పాకిస్థాన్ ట్వంటీ-20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్-3లో సచిన్ అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడారు. అందువల్ల సచిన తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఏప్రిల్‌లో జరిగే ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ఆడాలని ఆఫ్రిదితో పాటు.. పలువురు మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. అయితే, సచిన్ మాత్రం గతంలో ప్రకటించిన నిర్ణయాలకే కట్టుబడి ఉంటానని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు.
ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో ఆడక పోతే అది ఇతర జట్లకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఒక వేళ ఈ టోర్నమెంట్‌లో సచిన్ ఆడితో.. ఖచ్చితంగా అది భారత్‌కు ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు. సచిన్ రోజురోజుకు రూటుదేలుతూ పరుగుల వరద పారిస్తున్నాడన్నాడు. కాగా, 2007 సంవత్సరంలో ట్వంటీ-20 ఫార్మెట్ నుంచి సచిన్‌తో పాటు.. గంగూలీ, ద్రావిడ్‌లు తప్పుకున్న విషయం తెల్సిందే.