ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌ను షెడ్యూల్ మార్పులతో నిర్వహించాలని యాజమాన్యం నిర్వహించింది. ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులను మంగళవారం వెల్లడించనున్నారు. ఐపీఎల్ జరగాల్సిన సమయంలోనే సాధారణ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో, మ్యాచ్‌లకు భద్రత కల్పించడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
భద్రతాపరమైన కారణాలతో ఐపీఎల్ రెండో సీజన్‌పై నీలిమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. ఐపీఎల్ కొత్త తేదీలను ప్రకటించేందుకు లలిత్ మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు. ముంబయిలో ఈ రోజు మధ్యాహ్నం జరిగే విలేకరుల సమావేశంలో లలిత్ మోడీ వీటిని ప్రకటిస్తారు. సాధారణ ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ జరుగుతున్న కారణంగా, మ్యాచ్‌లకు తాము భద్రత కల్పించలేమని కేంద్రం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.