Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్టిండీస్ కెప్టెన్‌గా భారత సంతతి క్రికెటర్

Advertiesment
వెస్టిండీస్ కెప్టెన్ రామ్ దిన్ భారత సంతతి ఇంగ్లండ్ స్వదేశం సిరీస్ వన్డే క్రికెట్ మ్యాచ్లు
, ఆదివారం, 15 మార్చి 2009 (15:40 IST)
వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా 23 సంవత్సరాల దినేష్ రామ్ దిన్ నియమితులయ్యాడు. రామ్ దిన్ పూర్వీకులు 1845 - 1917 మధ్య కాలంలో చక్కెర పరిశ్రమ, కోకో తోటల్లో పని చేయడం కోసం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. రామ్‌దిన్ నేతృత్వంలో వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్ జట్టుతో వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది.

ప్రస్తుత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రామ్ దిన్ మంచి వికెట్ కీపర్ కూడా. ప్రస్తుత కెప్టెన్ క్రిస్ గేల్ గాయపడటంతో రామ్‌దిన్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. విండీస్ జట్టుకు సారథ్యం వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి ట్రినిడాడియన్ రామ్ దిన్.

భారతీయ సంతతికి చెందిన నాలుగో కెప్టెన్. ఇంతకుముందు రోహన్ కన్హాయ్, ఆల్విన్ కాళీచరణ్, శివనారాయణఅ చందర్ పాల్‌లు విండీస్ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించారు. రామ్ దిన్ గతంలో వెస్టిండీస్ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించి, మంచి విజయాలు సాధించాడు.

Share this Story:

Follow Webdunia telugu