న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జెస్సీ రైడర్ వెయ్యి పరుగుల క్లబ్‌కు మరో 232 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ క్లబ్లో చేరనున్న అత్యంత వేగవంతమైన బ్యాట్స్మెన్లలో రైడర్ ఒకడు. కేవలం 14 టెస్టులు ఆడిన రైడర్ ఇప్పటి వరకు 768 పరుగులు చేసి, వెయ్యి పరుగులకు మరో 232 పరుగుల దూరంలో ఉన్నాడు. గతంలో ఈ ఫీట్‌ను అందుకున్న కివీస్ బ్యాట్స్‌మెన్లలలో జాన్ ఎఫ్.రైడ్, మార్క్ రిచర్డ్‌సన్‌లు ఉన్నారు. అయితే, వీరిద్దరు వెయ్యి పరుగులను పూర్తి చేసేందుకు 20 ఇన్నింగ్స్ కావాల్సి వచ్చింది.
ప్రస్తుతం రైడర్ 64 శాతంతో నిలకడగా పరుగులు సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇదే జోరును రైడర్ కొనసాగించిన పక్షంలో మరో రెండు మూడు ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగులు పూర్తి చేయడం ఖాయంగా తెలుస్తోంది. గత టెస్టు చరిత్రను పరిశీలిస్తే కేవలం 19 మంది బ్యాట్స్‌మెన్స్ మాత్రమే 20 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఈ అరుదైన రికార్డును సాధించారు. వీరిలో ఇంగ్లండ్‌కు చెందిన హెర్బెర్ట్, విండీస్‌కు చెందిన ఎవెర్టాన్ వీక్స్ (12 ఇన్నింగ్స్‌లలో), డాన్ బ్రాడ్‌మెన్ (13 ఇన్నింగ్స్)లు ఉన్నారు.