దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం ప్రారంభమైన రెండో వన్డేలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ జట్టు 141 పరుగులు తేడాతో విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. కాగా, సెంచూరియన్ పార్కు మైదానంలో రెండో వన్డే జరుగుతోంది.
ఈ జట్టులో దక్షిణాఫ్రికా జట్టులోకి ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ అందుబాటులోకి వచ్చాడు. అలాగే, స్పిన్నర్ మార్వె, లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ పార్నెల్లకు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా జట్టులోని మఖయా ఎన్తికి తుది జట్టు నుంచి తప్పించారు. ఇరు జట్లు వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణాఫ్రికా.. గ్రేమ్ స్మిత్, గ్రిబ్స్, కలిస్, డీ విలియర్స్, డుమ్నీ, మార్క్ బౌచర్, మోర్కెల్ మెర్వే, జాన్ బోథా, పార్నెల్, డలే స్టైన్.
ఆస్ట్రేలియా.. మేఖేల్ క్లార్క్, హ్యాడిన్, రికీ పాంటింగ్, డేవిడ్ హస్సీ, మేఖేల్ హుస్ హుస్సీ, ఫర్గూసన్ జేమ్స్ హోప్స్, మిచెల్ జాన్సన్, బెన్ లాఫ్లిన్, నాథన్ హౌరిట్జ్, నాథన్ బ్రాకెన్.