Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాచ్ రిఫరీ బ్రాడ్‌పై పీసీబీ ఫిర్యాదు

Advertiesment
క్రీడలు క్రికెట్ వార్తలు లాహోర్ శ్రీలంక మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ
లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఇటీవల జరిగిన దాడిని ఖండిస్తూ తీవ్రంగా ఆరోపణలు చేసిన మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌పై ఫిర్యాదు చేస్తూ... పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఓ లేఖను రాసింది.

ఈ విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ... అధికారికంగా తమ ఫిర్యాదును ఐసీసీకి అందజేసినట్లు చెప్పాడు. ఏమైనా ఉంటే ఐసీసీతో చెప్పాలేగానీ, ఇలా బహిరంగ విమర్శలు చేయడం తగదని, ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినందుకు బ్రాడ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు.

ఇదిలా ఉంటే... ఘటన జరిగినప్పుడు పోలీసులు లేరని చెప్పడం పెద్ద తప్పని... దీన్ని నిరసిస్తూ తాము ఐసీసీకి ఫిర్యాదు చేస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పీసీబీ ఐసీసీకి లేఖను పంపడం గమనార్హం.

కాగా, లంక క్రికెటర్లపై దాడి జరిగినప్పుడు ఆ పరిసరాల్లో ఒక్క పోలీసు కూడా లేకపోవడంతో... ఉగ్రవాదులకు తమను సులువుగా అప్పగించినట్లయిందని బ్రాడ్ ఆరోపించిన సంగతి విదితమే.

మరోవైపు... శ్రీలంక ఆటగాళ్లపై జరిగిన దాడితో సమీప భవిష్యత్తులో పాక్‌లో క్రికెట్ జరిగే అవకాశాలు లేకపోయినప్పటికీ... 2011 ప్రపంచ కప్ నిర్వహణపై మాత్రం పీసీబీ ఆశలు ఏ మాత్రం చావలేదు. అంతేగాకుండా.. 6 నుంచి 9 నెలల్లో పాక్‌లో మళ్లీ అంతర్జాతీయ జట్లు పర్యటిస్తాయని ఇజాజ్ భట్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu