ముక్కోణపు సిరీస్ : ఉత్కంఠ భరితం .. టైగా ముగిసిన మ్యాచ్!
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (17:43 IST)
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం అడిలైడ్‌లో భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా ముగిసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 236 పరుగులు చేసింది. 237 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 50 ఓవర్లు ముగిసే సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠత నడుమ ఈ మ్యాచ్ టైగా ముగిసింది. టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సూపర్బ్ ఇన్నింగ్స్‌తో పాటు.. ఓపెనర్ గంభీర్ అద్భుతమైన పోరాట పటిమకారణంగా భారత్ ఈ మ్యాచ్‌ను టైగా ముగించుకుంది. అంతకుముందు.. లంక జట్టు... తొలి ఓవర్లోనే ఓపెనర్ తరంగా (0) ఖాతా తెరవకుండానే వెనుతిరగటంతో వికెట్ల పతనం ఆరంభమైంది. అలాగే, డాషింగ్ ఓపెనర్ దిల్షాన్ (16) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కులేక పోవటంతో శ్రీలంక కష్టాలో పడింది. కీపర్ సంగక్కర (31)తో యువ బ్యాట్స్‌మెన్ దినేష్ చందిమాల్ (81)లు కలిసి కొద్దిసేపు వికెట్లు పడకుండా కాపాడుతూ స్కోరు బోర్డును కదిలించారు. ఈ క్రమంలో చందిమాల్ అర్థ శతకాని పూర్తి చేశాడు. కెప్టెన్ జయవర్థనే (43), ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాణించిన ఆల్ రౌండర్ మ్యాథ్యూస్ (17), పెరీరా (5), కులశేఖర (12)లు రాణించారు. అయితే చివర్లో శ్రీలంక బౌలర్ సచిత్ర సేననాయకే (14 బంతుల్లో 22) వేగంగా పరుగులు సాధించటంతో శ్రీలంక 236/9 గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. భారత్ బౌలర్లలో వినయ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా, అశ్విన్‌కు రెండు, ఇర్ఫాన్ పఠాన్‌కు ఒక వికెట్ దక్కాయి. 237
పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ (15) మరోమారు విఫలమయ్యాడు. అయితే ప్రస్తుత సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గంభీర్ (91, 6*4)తో మరోసారి నిలకడగా రాణించి జట్టుకు విజయం అందించటంలో విఫలమయ్యాడు. మిడిలార్డర్లో కోహ్లీ (15, 1*4)తో పాటు రోహిత్ శర్మ (15, 1*4), సురేష్ రైనా (8) కూడా వెంట వెంటనే వెనుతిరిగారు. కెప్టెన్ కూల్ ధోనీ (69 బంతుల్లో 58 నాటౌట్ 6*4, 1*6) మాత్రం చివరి వరకూ పోరాడిన చివర్లో ఇర్ఫాన్ పఠాన్ (8) రనౌట్ అవ్వటంతో కథ ఒకసారీగా మారిపోయింది. తర్వాత వచ్చిన వినయ్ కుమార్(1) కూడా రనౌట్‌గా వెనుతిరగటంతో చివర్లో భారత్ మ్యాచ్‌ను టైగా ముగించుకుంది. శ్రీలంక బౌలర్లలో మలింగ, పెరారీలకు తలో రెండు వికెట్లు దక్కగా, కులశేక్కరకు ఒక వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ను కెప్టెన్ కూల్ ధోనీ అందుకున్నాడు.