మరో ఫ్రాంఛైజీ ఆటగాళ్ళతో చర్చలు జరిపినందుకు గాను ముంబై ఇండియన్ జట్టు యాజమాన్యాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ మేనేజ్‌మెంట్ హెచ్చరించింది. ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న సమయంలో ఒక ఫ్రాంఛైజీ జట్టుకు చెందిన ఆటగాడితో మరో ఫ్రాంఛైజీ జట్టు యాజమాన్యం చర్చలు జరుపడం ఐపీఎల్ నిబంధనలకు వ్యతిరేకమని ఐపీఎల్ పేర్కొంది.
ఇదిలావుండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు రవీంధ్ర జడేజాపై విధించిన నిషేధం చెల్లుతుందని ఐపీఎల్ యాజమాన్యం నియమించిన ఏకసభ్య విచారణ కమిటీ తీర్పు ఇచ్చింది. 2008-09 సంవత్సరానికి జరుగుతున్న ఐపీఎల్ పోటీల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న జడేజా.. ముంబై ఇండియన్ జట్టు తరపున ఆడేందుకు చర్చలు జరిపినట్టు సమాచారం.