Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా వరల్డ్‌కప్ : ఆసీస్‌పై భారత్ విజయం

Advertiesment
క్రీడలు క్రికెట్ మహిళా వరల్డ్కప్ సూపర్ సిక్స్ ఆస్ట్రేలియా టీం ఇండియా శనివారం సిడ్నీ టాస్ ఫీల్డింగ్ బ్యాటింగ్ దేశ్పాండే
వరుస విజయాలతో దూసుకుపోతూ.. మహిళల క్రికెట్ ప్రపంచకప్‌ సూపర్ సిక్స్‌లో స్థానం సంపాదించుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ మేరకు శనివారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో... ఆస్ట్రేలియా జట్టుపై టీం ఇండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

శనివారం సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. దేశ్‌పాండే 45, చోప్రా 76, కామిని 2, మిథాలీ రాజ్ 44, గోస్వామి 5, కౌర్ 19, శర్మ 31 (నాటౌట్) పరుగులు సాధించి స్కోరు బోర్డును 234 వరకూ నడిపించారు.

అనంతరం... భారత్ విధించిన 235 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేసి, భారత్‌కు దాసోహమయ్యింది. టీం ఇండియా బౌలర్లలో రీనా మల్హోత్రా, సుల్తానాలు చెరో రెండు వికెట్లు తీయగా... గోస్వామి, రుమెలి ధర్, శర్మలు తలా ఒక వికెట్ పడగొట్టారు. చోప్రా మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డును చేజిక్కించుకుంది.

Share this Story:

Follow Webdunia telugu