మహిళల ప్రపంచకప్‌లో భారత మహిళాజట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలు సన్నగిల్లాయి. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన సూపర్‌సిక్స్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో భారత ఫైనల్ ఆశలకు గండిపడింది.
ఈ నేపథ్యంలో గురువారం జరిగే సూపర్‌సిక్స్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ గెలవగలిగి, పాక్ చేతిలో న్యూజిలాండ్ మహిళాజట్టు ఓడిపోయి, ఇంగ్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోతే భారత్ ఫైనల్ చేరే అవకాశాలున్నాయి. అయితే ఈ విధంగా జరిగే అవకాశాలు తక్కువ కాబట్టి భారత్ ఫైనల్ చేరడం ఇక అదృష్టంపైనే ఆధారపడినట్టే.
అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళాజట్టు ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 208 పరుగులు సాధించగా, కివీస్ జట్టు 47.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఫైనల్‌కు చేరే అవకాశాలను న్యూజిలాండ్ మహిళాజట్టు మరింత మెరుగుపర్చుకుంది.