Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ నుంచి కివీస్ పాఠాలు

Advertiesment
భారత్ న్యూజిలాండ్ పర్యటన కివీస్ పాఠాలు మెక్కల్లుమ్ ధోనీ ఆటగాళ్లు సచిన్ లక్ష్మణ్ ద్రావిడ్ ప్రభావం
, మంగళవారం, 24 మార్చి 2009 (11:44 IST)
FileFILE
యువ ఆటగాళ్లు పాఠాలు నేర్చుకోవడానికి న్యూజిలాండ్ పర్యటన ఓ వేదికగా ఆ దేశంలో భారత పర్యటన ప్రారంభం కాకముందు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. కానీ, ఎంతో అనుభవం గడించిన భారత జట్టు నుంచి కొన్ని కీలకమైన పాఠాలను నేర్చుకోవడానికి ఈ పర్యటన తమకు వచ్చిన గొప్ప అవకాశమని తాము విశ్వసిస్తున్నట్లు న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్‌కల్లుమ్ వ్యాఖ్యానించాడు.

నేపియర్‌లో విలేకరుతో మెక్‌కల్లుమ్ మాట్లాడుతూ, అనుభవం మరియు నైపుణ్య పరంగా ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య కొంత వరకు వ్యత్యాసముందన్నాడు. భారత స్టార్లయిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా క్రికెట్ మైదానంలో తమ ప్రభావాన్ని చూపుతున్నారని తెలిపాడు.

భారత ఆటగాళ్లతో తమ జట్టు ఆటగాళ్లను ఏ విధంగా పోల్చనని వ్యాఖ్యానించాడు. తనకు తెలిసి టెండూల్కర్, ద్రావిడ్, వీవీఎస్ లక్షణ్‌లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాట్సమెన్‌లుగా రాణించగలని ప్రశంసించాడు. ఇలాంటి విషయాలన్నీ తాము నేర్చుకోవలసినవేనన్నాడు.

కాగా, న్యూజిలాండ్ పర్యటనలో భారతే ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అనూహ్యంగా ట్వంటీ-20 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాభవాన్ని చవిచూసింది. అయితే అంతర్జాతీ వన్డే సిరీస్‌లో మాత్రం భారత్ తన అమ్ములపొదిలోని అస్త్రాలతో ప్రత్యర్థులను మట్టికరిపించింది.

దీంతో వన్డే సిరీస్ 3-1తో భారత వశం అయింది. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోను భారత్ తొలి టెస్టులో ఘనవిజయం సాధించి 1-0తో ముందంజలో విషయం విదితమే.

Share this Story:

Follow Webdunia telugu