భారత్ "ఏ" జట్టులో స్థానం దక్కిచుకోవడమే లక్ష్యం: సుమన్
టీం ఇండియా "ఎ" జట్టులో ప్రవేశించడమే ప్రధాన లక్ష్యమని హైదరాబాదీ క్రికెటర్ సుమన్ వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో రాణించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సుమన్ తెలిపాడు. ఇంకా రంజీ జట్టు తరపున గట్టిపోటీని ప్రదర్శించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని సుమన్ తెలిపాడు. కాగా.. ఐపీఎల్ మూడో సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన సుమన్.. జట్టు పరువును కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా 307 పరుగులు సాధించిన రోహిత్ శర్మ (404) సైమండ్స్ (429)లకు తర్వాత అత్యధిక స్కోరును నమోదు చేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌తో డెక్కన్ తరపున ధీటుగా రాణించడం ఎంతో ఆనందంగా ఉందని, కానీ భారత్ ఎ జట్టులో స్థానం సంపాదించుకోవాలన్నదే తన లక్ష్యమని సుమన్ చెప్పాడు. అలాగే వచ్చే రంజీ సీజన్‌లో బాగా ఆడుతానని సుమన్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-3లో ఐదు పోటీల్లో వరుసగా ఓడిన డెక్కన్ ఛార్జర్స్‌ను సుమన్ తన ఆటతీరుతో ఆదుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 78 పరుగులతో సుమన్ అజేయంగా నిలిచాడు. అలాగే ఐపీఎల్-3లో డెక్కన్ ఛార్జర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించడంలోనూ కీలక పాత్ర పోషించాడు.