Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుచానన్‌కు వ్యతిరేకంగా దాదా అభిమానుల నిరసన

Advertiesment
క్రీడలు క్రికెట్ వార్తలు బుచానన్ వ్యతిరేకం దాదా అభిమానులు నిరసన కోల్కతా నైట్ రైడర్స్ దిష్టిబొమ్మ రొటేషన్ కెప్టెన్సీ పద్ధతి
కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించేందుకు ఆ జట్టు మేనేజర్ జాన్ బుచానన్ ప్రయత్నిస్తున్నారని గంగూలీ అభిమానులు గళమెత్తారు. బుచానన్‌ను వెంటనే నైట్‌రైడర్స్ నుంచి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం గంగూలీ అభిమానులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గార్డెన్ మైదానం ఆవరణలో బుచానన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోల్‌కత క్రికెట్ స్టార్ అయిన గంగూలీకి కెప్టెన్సీ పదవిని అప్పగించక, ఆయనను అవమానించిన బుచానన్‌ను వెంటనే మేనేజర్ పదవి నుంచి తప్పించాలని అభిమానులు కోరారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు గంగూలీనే సరైన సారథి అని వారు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ రెండో సీజన్‌కు రంగం సిద్ధమైన నేపథ్యంలో.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు రొటేషన్ కెప్టెన్సీ పద్ధతిని ఆ జట్టు మేనేజర్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu