ఐపీఎల్ ట్వంటీ-20 రెండో ఎడిషన్‌లో బహుళ కెప్టెన్ల థియరీ ప్రవేశపెట్టాలని కోల్‌కతా నైట్ రైడర్స్ మేనేజర్ జాన్ బుచానన్ చేసిన ప్రతిపాదన ఆసక్తికరంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు. ఈ తరహా ప్రతిపాదన వల్ల షార్టెస్ట్ ఫార్మాట్
గేముల్లో ఫలితాలు, ప్రణాళికలు వేగవంతంగా జరుగుతాయని అభిప్రాపడ్డాడు.
దక్షిణాఫ్రికాలో ఐపీఎల్-2 టోర్నీలో పాల్గొనేందు కోసం తన జట్టు సభ్యులతో సహా ముంబాయి చేరుకున్న కైఫ్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బహుళ కెప్టెన్ల థియరీ అనేది చెడు ప్రభావం చూపించేది కాదన్నాడు. అయితే దీనిపై తాను అంత ఎక్కువగా శ్రద్ధ చూపించడం లేదని థియరిపై కొంత ఆసక్తి మాత్రమే ఉన్నదని పేర్కొన్నాడు.
కాగా, బుచానన్ చేసిన ఈ బహుళ కెప్టెన్ల్ థియరీ ప్రతిపాదనను ఆయన జట్టు సభ్యుల నుంచే వ్యతిరేకత ఎదురైంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరియు సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌లు ఈ ప్రదిపాదనతో ఏకీభవించని విషయం తెలిసిందే.