పెళ్లి కాలేదు... ట్విట్టర్‌లోని షోయబ్ ట్వీట్ నిజం కాలేదు
షోయబ్ - సానియా వివాహం శుక్రవారమేనని ఖాజీలు చెప్పినా సోనియా కుటుంబం మాత్రం పెళ్లి సమయాన్ని ధృవీకరించకపోవడంతో "నిఖా"పై సందిగ్ధత నెలకొంది. అయితే వీటన్నిటికీ తెరదించుతూ షోయబ్ మాలిక్ స్వయంగా ట్విట్టర్‌లో తన పెళ్లి శుక్రవారం రాత్రి 7 గంటలను జరుగుతుందని రాసుకున్నాడు. అయితే మాలిక్ చెప్పినట్లుగా శుక్రవారం సానియాతో నిఖా జరుగకపోవడంతో ట్విట్టర్‌లో షోయబ్ చెప్పిన మాట వాస్తవ రూపం దాల్చలేకపోయింది.అంతకుముందు పెళ్లి ఏప్రిల్ 15 అని సానియా జంట మీడియా ముందు చెప్పిన సంగతి విదితమే. అయితే హఠాత్తుగా శుక్రవారం షోయబ్- సానియాల వివాహం జరుగుతుందని ఖాజీ ప్రకటించడంతో గందరగోళం నెలకొన్నది. చివరికి సానియా మేనత్త హమీదా స్పందిస్తూ... నిఖా 15వ తేదీన జరుగుతుందని, ఆ రోజే సానియా-షోయబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఉంటుందని తెలిపారు. శుక్రవారం సానియా మీర్జాను పెళ్లి కూతుర్ని చేస్తూ.. ఓ విందు కార్యక్రమం మాత్రమే జరుగుతుందని ఆమె వెల్లడించింది.