పాక్ ఆటగాళ్లు ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాలి: ఇజాజ్
కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్‌లోపు పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పాక్ అసిస్టెంట్ కోచ్ ఇజాజ్ అహ్మద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పాకిస్థాన్ క్రికెటర్లు ఫీల్డింగ్‌లోని మెలకువలను గ్రహించాలని ఇజాజ్ సూచించాడు. అప్పుడే ట్వంటీ-20 వరల్డ్ కప్ టైటిల్ పాకిస్థాన్ సొంతమవుతుందని పేర్కొన్నాడు. జట్టులో మేటి క్రికెటర్లున్నప్పటికీ, బౌలింగ్ తీరులో మాత్రం కాస్త మెరుగైన ప్రదర్శన అవసరమని ఇజాజ్ చెప్పాడు. అందుచేత పాకిస్థాన్ క్రికెటర్లు ఫీల్డింగ్ విభాగంలో ఆటగాళ్లకు తీవ్రంగా శిక్షణ పొందాలని హితవు పలికాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ పాక్ ఆటగాళ్లు రాణించే తరహాలో శిక్షణ ఇస్తానని ఇజాజ్ చెప్పుకొచ్చాడు. దీనికోసం ఈ నెల 28వ తేదీ నుంచి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కోచ్ వెల్లడించాడు.