ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ హోదాను నిలబెట్టుకునేందుకు ఆసీస్.. ఎలాగైనా సరే నెంబర్‌వన్ దక్కించుకోవాలని దక్షిణాఫ్రికాలు గట్టి పట్టుదలతో రంగంలోకి దిగుతున్నాయి.
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా... జోహెనెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఆసీస్-దక్షిణాఫ్రికాల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ పోరాటం ఆరంభం అవనుంది. కాగా, ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను స్వదేశంలోనే ఖంగు తినిపించిన జట్టుతోనే దక్షిణాఫ్రికా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... ఈ సిరీస్‌లో గెలిచినట్లయితే, ప్రోటీస్‌కే నెంబర్‌వన్ హోదా దక్కుతుంది. ఆసీస్ నెంబర్‌వన్ చేజార్చుకుని రెండో స్థానానికి పడిపోతుంది. ఇకపోతే... ఆసీస్ జట్టు ఈ టెస్ట్ సిరీస్‌లో, జట్టు కూర్పులో పలు ఇబ్పందులను ఎదుర్కొంటోంది. మార్కస్ నార్త్, పిల్ హ్యూజెస్, బ్రెస్ మెక్‌గెయిన్, బెన్ హిలెఫెన్హాస్‌లు ఆసీస్ జట్టులో చోటును ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం టెన్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.