టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు కివీస్‌పై అలవోకగా గెలుస్తుందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా అన్నారు. ప్రస్తుతం ఏ జట్టునైనా ఓడించాలంటే అది భారతేనని ఆయన చెప్పారు. కెప్టెన్ ధోని జట్టును ముందుండి నడిపిస్తాడని రమీజ్ నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రస్తుత భారత్ జట్టు 90ల్లో పాక్ జట్టులా ఉందని, అప్పుడు పాక్‌కు అత్యుత్తమ బౌలింగ్ వనరులతో పాటు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండేదని రమీజ్ అన్నారు. ఐతే భారత్ ఒకడుగు ముందుకేసి ఆసీస్‌ను వన్డే సిరీస్‌లో మట్టికరిపించిందని గుర్తు చేశారు.
భారత్‌ను కివీస్ కష్టాల్లోకి నెట్టుతుందని అనుకోవడం లేదని, ప్రస్తుతం ఆ జట్టు బౌలింగ్‌లో అంత పసలేదని, కచ్చితంగా భారత్ అలవోకగా గెలుపును నమోదు చేసుకుంటుందని రమీజ్ వెల్లడించారు.