Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దూరదర్శన్‌లో భారత్ - కివీస్ వన్డేల ప్రసారం

Advertiesment
దూరదర్శన్ భారత్ కివీస్ వన్డే ప్రత్యక్ష ప్రసారం ట్వంటీ20 వన్డేలు ఏడు మ్యాచ్లు
ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగే వన్డే, ట్వంటీ-20 పోటీలను జాతీయ ఛానల్ దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రెండు ట్వంటీ-20లతో సహా, ఐదు వన్డేలను కలుపుకుని మొత్తం ఏడు మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నట్టు ఆ డిడి అధికారులు వెల్లడించారు.

47 రోజుల సుదీర్ఘ పర్యటన నిమిత్తం మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని టీమ్ ఇండియా ఈనెల 20వ తేదీన కివీస్ గడ్డపై కాలుమోపిన విషయం తెల్సిందే. ఈ పర్యటనలో ట్వంటీ-20, వన్డేలు కాకుండా, మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏడు మ్యాచ్‌లను దూరదర్శన్‌ జాతీయ ఛానల్‌ డిడి-1లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రసార భారతి తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu