సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా జట్టు 197 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంమది. జట్టు బ్యాట్స్‌మెన్స్ ప్రిన్స్ (150), కల్లీస్ (102)లు సెంచరీలతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు తన తొలిఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసింది. దీంతో 195 పరుగులు ఆధిక్యం లభించింది.
ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు మూడో టెస్టులో గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని 2-1గా తగ్గించాలని భావిస్తోంది. తదనుగుణంగా బ్యాటింగ్ చేస్తోంది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా రాణిస్తున్నారు.