త్వరలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లాడుతా..!: అక్తర్
వివాదాస్పద పాకిస్థాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో త్వరలో అడుగుపెడతానని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. వయస్సు పెరిగినప్పటికీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిట్‌నెస్, క్రమశిక్షణ చర్యలతో షోయబ్ అక్తర్‌ను జట్టుకు దూరం చేసింది. అయితే షోయబ్ అక్తర్ మాత్రం సెలక్టర్లు తిరిగి తనకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇప్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం 34 ఏళ్ల స్టార్ క్రికెటర్ షోయబ్ అక్తర్ పాకిస్థాన్ దేశవాళీ జట్టు తరపున ఆడుతున్నాడు. పెంటాగులర్ కప్ వన్డే టోర్నమెంట్ కోసం షోయబ్ అక్తర్ ఫెదరర్ ఏరియాస్ తరపున బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నమెంట్ ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ.. దేశవాళీ జట్టులో తనకు అవకాశం కల్పించిన సెలక్టర్లకు షోయబ్ అక్తర్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే దేశవాళీతో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ ఆడే అవకాశం తనకు త్వరలో వస్తుందన్నాడు. ఈ టోర్నీలో తన తప్పులను సరిదిద్దుకుని, గట్టి పోటీని ప్రదర్శించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని అక్తర్ వెల్లడించాడు.