జోహెన్స్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు ఆరంభంలో కష్టాల్లో పడ్డారు. క్లార్క్ (2), పాటింగ్ (1) వెంట వెంటనే ఔట్ అయ్యారు.
తర్వాత మైదానంలోకి దిగిన ఓపెనర్ వార్నర్ (38), హస్సీ కలిసి జట్టును కొంత మేర ఆదుకున్నారు. వార్నర్ నిష్క్రమించిన తర్వాత హస్సీ (0), హడ్డిన్ (1)తో సఫారీ బౌలర్లకు మూల్యం చెల్లించుకుని ఇంటిముఖం పట్టారు.
దీంతో ఆసీస్ సగం ఓవర్లు పూర్తయ్యే సరికి 71 పరుగులు మాత్రం చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ హస్సీ 44 బంతుల్లో ఆరు సిక్స్‌లు, 5 ఫోర్లతో 88 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి, 166 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ డేవిడ్ హస్సీ (ఆస్ట్రేలియా)కు దక్కింది.
ఆస్ట్రేలియా ముందుంచిన 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేధించి, గెలుపును నమోదు చేసుకుంది. సఫారీల జట్టులో ఆమ్లా (26), గిబ్స్ (19), డుమిని (21), బౌచర్ (36 నాటౌట్), మోర్కెల్ (37)లు సమిష్టిగా రాణించారు. ఆసీస్ బౌలర్లలో గీవ్స్, డేవిడ్‌హస్సీలు చెరి రెండు వికెట్లు పడగొట్టారు.