ఇప్పటికే వన్డేల్లో చిత్తుచిత్తుగా ఓడిన న్యూజిలాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జాకబ్ ఓరమ్ గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అతని స్థానంలో జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను తీసుకున్నారు. అలాగే, బ్రెంట్ ఆర్నెల్‌కు కూడా జట్టులో స్థానం కల్పించారు. కాగా, భారత్-కివీస్‌ల మధ్య తొలి టెస్ట్ ఈనెల 18వ తేదీన హామిల్టన్‌లో ప్రారంభంకానుంది.
13 మంది సభ్యులతో కూడిన కివీస్ జట్టును గురువారం కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు వన్డే కెప్టెన్ డేనియల్ వెట్టోరి నాయకత్వం వహిస్తారు. అలాగే, 31 టెస్ట్‌లలో ఐదు సెంచరీలు, 60 వికెట్లు తీసి జట్టులో మంచి ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన జేమ్స్ ఫ్రాంక్లిన్‌కు స్థానం కల్పించారు. కాగా, ప్రస్తుతం భారత్-కివీస్ జట్టుల చివరి వన్డే అక్లాండ్ మైదానంలో చివరి వన్డే జరుగుతుంది.
జట్టు వివరాలు.. డేనియల్ వెట్టోరి (కెప్టెన్), బ్రెంట్ అర్నెల్, డేనియల్ ఫైన్, జైమ్స్ ఫ్రాంక్లిన్, మార్టిన్ గుప్తిల్, బ్రెండాన్ మెక్‌కల్లమ్, క్రిస్ మార్టిన్, కైలే మిల్స్, ఇయాన్ ఓబ్రియిన్, జీతన్ పటేల్, జీస్సే రైడర్, రాస్ టైలర్.