డెక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం!
హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. శుక్రవారం రాత్రి మొహలీలో జరిగిన 22వ లీగ్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో వరుసగా మూడో విజయం చేరింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజమ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-డెక్కన్ ఛార్జర్స్‌ల మధ్య జరిగిన ఈ పోరులో యూసుఫ్ పఠాన్ విజృంభించి 73 పరుగులు చేయడంతో శిల్పాశెట్టి ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ విజయభేరి మోగించింది. ఫలితంగా ఐపీఎల్-2 టైటిల్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ డక్కన్ ఛార్జర్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. టైట్ బౌలింగ్‌లో రాణించి మూడు వికెట్లు తీసుకోగా బ్యాటింగ్‌లో 'ట్రంప్‌కార్డ్' యూసుఫ్ పఠాన్ విజృంభించి 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ సునాయాస విజయం నమోదు చేసుకుంది. ఐపీఎల్-3లో మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయిన రాజస్థాన్ తరువాత జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ గెలుపొంది తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ పట్టికల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ ఛార్జర్స్ 9 వికెట్ల నష్టానికి 148 పరు గులు చేయగా, రాజస్థాన్ 15.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకటించారు.