Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ట్వంటీ-20 వార్మప్ మ్యాచ్: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్!

Advertiesment
ఐసీసీ ట్వంటీ20
FILE
సెయింట్ లూసీలో జింబాబ్వేతో జరిగిన ట్వంటీ-20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఆస్ట్రేలియా అనూహ్యంగా ఓడింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఒక పరుగు తేడాతో విజయం సాధించి మైకేల్ క్లార్క్ సేనకు షాక్ ఇచ్చింది.

తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే.. జింబడా (35 బంతుల్లో 76 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది. తదనంతరం 173 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి ఓవర్లో రెండు వికెట్లు చేజార్చుకుని ఏడు వికెట్ల పతనానికి 172 పరుగులు సాధించింది. దీంతో కేవలం ఒక పరుగు తేడాతో జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడింది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (72) భారీ స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. లక్ష్యాన్ని చేధించే క్రమంలో ధీటుగా ఆడిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌కు జింబాబ్వే బౌలర్లు జడుసుకున్నారు. ఫలితంగా డేవిడ్ వార్నర్ 49 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్లతో72 పరుగులు సాధించి స్కోర్ రేటును వేగంగా నడిపించాడు. దీంతో ఆసీస్ 13.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 95 పరుగులు సాధించింది.

అలాగే కెప్టెన్ మైకేల్ క్లార్క్ 49 పరుగులు, మిట్చెల్ జాన్సన్ 23 పరుగులతో ఆసీస్‌ను విజయబాటలో నడిపించారు. అయితే ఆస్ట్రేలియా గెలుపొందేందుకు 13 పరుగులు కావాల్సి ఉండగా, మైకేల్ క్లార్ పెవిలియన్ దారి పట్టడంతో ఆసీస్ కష్టాల్లో పడింది.

దీనికి తోడు మిట్చెల్ జాన్సన్ రనౌట్ కావడంతో.. చివరి బంతిలో బ్రెట్‌ లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించగలిగాడు. ఫలితంగా వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ ఓడినా ట్వంటీ-20 సీజన్‌లో ఆస్ట్రేలియా తొలి ఓటమిని నమోదు చేసుకోవడం గమనార్హం.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు ఆరు ఓవర్లలో 36/4 స్కోరును నమోదు చేసుకుంది. అయితే ఎల్డన్ చిగుంబరా క్రీజులో రాణించాడు. 35 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 76 పరుగుల సాధించిన చిగుంబరా జింబాబ్వే జట్టులో అత్యధిక స్కోరును నమోదు చేసుకుని అజేయంగా నిలిచాడు.

ఈ క్రమంలో జింబాబ్వే ఆటగాళ్లలో ఎర్విన్ (39) పరుగులు సాధించాడు. వీరిద్దరూ.. తమ భాగస్వామ్యంతో 114 పరుగులు జోడించి, జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇకపోతే.. ఆస్ట్రేలియా బౌలర్లలో మిట్చెల్ జాన్సన్.. నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి, నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రెట్‌ లీ 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. ఇక నేనన్స్ ప్రత్యర్థి జట్టుకు 20 పరుగులిచ్చి ఒక వికెట్‌ను తనఖాతాలో వేసుకున్నాడు. అలాగే షేన్ వాట్సన్ కూడా రెండు ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్‌ను సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో ఉత్సేయ రెండు వికెట్లు పడగొట్టగా, క్రీమర్, పొఫు చెరో ఒక వికెట్‌ను సాధించారు.

Share this Story:

Follow Webdunia telugu