ట్వంటీ-20 వరల్డ్‌కప్: భారత జట్టు కెప్టెన్‌గా గోస్వామి!
వెస్టిండీస్‌లో జరిగే ప్రపంచకప్ ట్వంటీ-20లో ఆడే భారత మహిళా జట్టుకు బెంగాల్ పేస్-ఉమెన్ జులన్ గోస్వామి కెప్టెన్సీ సారథ్యం వహించనుంది. కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ట్వంటీ-20లో ఆడే భారత మహిళల జట్టును శుక్రవారం జాతీయ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 14
మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఇటీవల సస్పెండ్‌కు గురైన ఎడమ చేతి స్పిన్నర్ పూనమ్ రౌత్‌కు కూడా సెలక్షన్ కమిటీ స్థానం కల్పించింది. మేలో జరుగనున్న ఈ పరిమిత ఓవర్ల ట్వంటీ-20లో ఇంకా మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా, స్టార్ బ్యాట్స్ఉమెన్ మిథాలీ రాజ్ మరియు ఆల్-రౌండర్ రుమేలి ధర్‌లకు కూడా జట్టులో చోటు సంపాదించుకున్నారు. జట్టు వివరాలు: జులన్ గోస్వామి (కెప్టెన్), మిథాలీ రాజ్, పూనమ్ రౌత్, సులక్షణ నాయక్, అనఘా దేశ్‌పాండే, రుమేలి ధర్, అమిత శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, రీమా మల్హోత్రా, డయానా డేవిడ్, గౌహర్ సుల్తానా, సోనియా దబీర్, ప్రియాంక రాయ్, అంజుమ్ చోప్రా.