ట్వంటీ-20 వరల్డ్ కప్: కివీస్ జట్టులో రైడర్‌కు స్థానం!
కరేబియన్ గడ్డపై వచ్చే నెలలో ప్రారంభం కానున్న ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే న్యూజిలాండ్ జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జెస్సీ రైడర్‌కు స్థానం దక్కింది. ట్వంటీ-20 వరల్డ్‌కప్‌లో ఆడే న్యూజిలాండ్ జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న సమయంలో గాయానికి గురైన రైడర్‌కు కూడా సెలక్టర్లు చోటు కల్పించారు.సెప్టెంబర్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గాయానికి గురైన జెస్సీ రైడర్‌కు ఉదర సంబంధమైన శస్త్రచికిత్స చేశారు. దీంతో న్యూజిలాండ్ దేశవాళీ టోర్నీకి రైడర్ దూరమయ్యాడు. కానీ ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న జెస్సీ రైడర్, పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగుతాడని సెలక్టర్లు వెల్లడించారు. ఇంకా గత వారంలో వెల్టింగ్టన్ ప్రావిన్స్ తరపున ఆడిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో రైడర్ 109 బంతుల్లో 103 పరుగులు సాధించాడు. దీంతో ప్రపంచకప్ ట్వంటీ-20లోనూ రైడర్ రాణిస్తాడని సెలక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కంటెబర్రీ బ్యాట్స్‌మెన్ రాబ్ నికోల్ అనే యువ క్రికెటర్‌కు న్యూజిలాండ్ ట్వంటీ-20 జట్టులో స్థానం కల్పించారు. ఇకపోతే.. ఏప్రిల్ 30 నుంచి మే 16 వరకు జరిగే ట్వంటీ-20 ప్రపంచకప్‌లో శ్రీలంక, జింబాబ్వేలతో కలిసి న్యూజిలాండ్ బి గ్రూప్ తరపున న్యూజిలాండ్ ఆడనుంది. జట్టు వివరాలు: డానియెల్ వెటోరీ, షేన్ బాండ్, ఇయాన్ బట్లర్, గరేథ్ హోప్కిన్స్, బ్రెండాన్ మెక్కల్లమ్, నాథన్ మెక్కల్లమ్, కేయిల్ మిల్స్, రాబ్ నికోల్, జాకోబ్ ఓరమ్, ఆరోన్ రెడ్మండ్, జెస్సీ రైడర్, టిమ్ సౌథీ, స్కాట్ స్టైరిస్, రాస్ టాయిలర్.