నేపియర్‌లో జరిగిన రెండో టెస్టులో టీం ఇండియా తప్పించుకుందని న్యూజిలాండ్ పేసర్ క్రిస్ మార్టిన్ చెప్పాడు. రెండో టెస్టు డ్రా ముగించడంతో ఓటమి నుంచి భారత్ తృటిలో తప్పుకుందని మార్టిన్ అన్నాడు.
ఏప్రిల్ మూడో తేదీన (శుక్రవారం) వెల్లింగ్టన్‌లో జరుగనున్న కీలక మూడో టెస్టు మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు విజృంభిస్తారని, మానసికంగా, శారీరికంగా తమ జట్టు క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని మార్టిన్ ధీమా వ్యక్తం చేశాడు.
మూడో టెస్టులో న్యూజిలాండ్ గెలిస్తే 2-0 పాయింట్ల ఆధిక్యంతో టెస్టు సిరీస్‌ను సమం చేస్తుందని, తమ జట్టు బౌలర్లు పోరాట పటిమతో ప్రత్యర్థి జట్టును హడలెత్తింపజేసేందుకు సిద్ధంగా ఉన్నారని మార్టిన్ అన్నాడు. మైదానంలో తమ జట్టు బౌలర్ల ఆటతీరును చూసి తానెంతో నేర్చుకున్నానని అతడు అన్నాడు.