సొంత గడ్డపై పటిష్టమైన భారత్ జట్టుతో ఆరంభమైన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని, భారత్‌ను ఆరంభంలోనే దెబ్బతీసి పట్టు సాధించేందుకే ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించినట్టు కివీస్ కెప్టెన్ వెట్టోరి వెల్లడించారు. కాగా, 47 రోజుల పాటు సాగే సుదీర్ఘ పర్యటనలో ఇరు జట్లు తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో బుధవారం తలపడుతున్నాయి.
తుది జట్ల వివరాలు..
కివీస్ జట్టు: మెక్‌కల్లమ్, జెస్సీ రైడర్, మార్టిన్ గుప్తిల్, రాస్ టైలర్, జాకబ్ ఓరమ్, నాథన్ మెక్‌కల్లమ్, డేనియల్ వెట్టోరి, ఇయాన్ బట్లర్, టిమ్ సౌథీ, థాంమ్సన్, ఇయాన్ ఒబ్రియన్.
భారత జట్టు: గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ (కెప్టెన్, కీపర్), యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ.