Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జింబాబ్వేలో ముక్కోణపు వన్డే సిరీస్: బీసీసీఐ

Advertiesment
జూలై నెల జింబాబ్వే క్రికెట్ బోర్డు ముక్కోణపు వన్డే సిరీస్ ఆతిథ్య దక్షిణాఫ్రికా భారత్ బీసీసీఐ ప్రకటన
వచ్చే జూలై నెలలో జింబాబ్వే గడ్డపై భారత్ ముక్కోణపు వన్డే సిరీస్‌ను ఆడనుంది. ఈ టోర్నీలో ఆతిథ్య జింబాబ్వే జట్టుతో పాటు దక్షిణాఫ్రికా, భారత్ జట్లు పాల్గొంటాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం ప్రకటించాయి. జూన్ నెలలో ఇంగ్లండ్‌ గడ్డపై ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్ జరుగనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత జూన్‌లో ముక్కోణపు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్ తర్వాత భారత్ కరేబియన్ దీవుల్లో నాలుగు వన్డే మ్యాచ్‌లను వెస్టిండీస్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల తర్వాత ముక్కోణపు సిరీస్‌ను ఆడేందుకు జింబాబ్వేకు వెళుతుంది. ఈ టోర్నీలో జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటాయని చెప్పారు.

జులైలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చేపట్టాల్సిన పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, ఈ పర్యటన యధావిధిగా జరుగుతుందని, కివీస్ జట్టు స్థానంలో భారత్ వస్తుందని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. అలాగే, కెన్యా క్రికెట్ జట్టు మూడో దేశంగా పాలు పంచుకోవచ్చని సూచన ప్రాయంగా వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu