కెప్టెన్ వసీం జాఫర్ (118) రాణించడంతో బుధవారం జరిగిన డియోధర్ ట్రోఫీ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌పై 218 పరుగుల భారీ తేడాతో వెస్ట్ జోన్ విజయం సాధించింది. దీంతో డియోధర్ ట్రోఫీ వెస్ట్ జోన్ వశమైంది. వెస్ట్ జోన్‌కు ఇది తొమ్మిదో డియోధర్ ట్రోఫీ కావడం గమనార్హం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్ట్ జోన్ కెప్టెన్ వసీం జాఫర్ 108 బంతుల్లో 116 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. జాఫర్‌తోపాటు చేతేశ్వర్ పుజారా అర్ధ సెంచరీ (86 బంతుల్లో 94 పరుగులు) సాధించడంతో వెస్ట్ జోన్‌కు ఫైనల్ వన్డేలో భారీ స్కోరుకు అవకాశం లభించింది.
భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఈస్ట్ జోన్ 39.4 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటయింది. అంతకుముందు ఈస్ట్ జోన్ బౌలింగ్ ప్రభావవంతంగా లేకపోవడంతో వెస్ట్ జోన్ బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా (61 నాటౌట్), అభిషేక్ నాయర్ (54 నాటౌట్) చెలరేగి ఆడారు. చివరి ఏడు ఓవర్లలో 99 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించారు.