Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యం

Advertiesment
మినీ ప్రపంచ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ దక్షిణాఫ్రికా పాకిస్థాన్ శ్రీలంక ఐసిసి భద్రత రద్దు
మినీ ప్రపంచ కప్‌గా పరిగణించే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను దక్షిణాఫ్రికాకు అప్పగించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) సోమవారం దుబాయ్‌లో అధికారికంగా వెల్లడించింది. పాకిస్థాన్‌లో జరగాల్సిన ఈ ట్రోఫీని భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేశారు.

ఆ తర్వాత ఈ టోర్నీ వేదికను శ్రీలంకకు మార్చాలని నిర్ణయించారు. అయితే, వచ్చే సెప్టెంబరు నెలలో అక్కడ విపరీతమైన వర్షాలు కురుస్తాయి. వీటివల్ల మ్యాచ్‌లకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఐసిసి నిర్వాహకులు సందేహం వ్యక్తం చేశారు. దీనికి తోడు.. తమిళ టైగర్లకు లంక సైన్యానికి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది.

దీనివల్ల లంకలో పర్యటించేందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలకు సురక్షితమైన ప్రాంతంగా ఉండే దక్షిణాఫ్రికా గడ్డను ఐ.సి.సి ఎంపిక చేసింది. కాగా, ఈ పోటీలు సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ వరకు జరుగుతాయి.

జోహెన్స్‌బర్గ్‌లోని వాండర్సన్ మైదానం, సెంచూరియన్‌ పార్క్‌లలో పోటీలు జరుగుతాయి. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సవాల్‌గా స్వీకరించింది. ఇదిలావుండగా, వచ్చే ఏడాది కరేబియన్ దీవుల్లో జరిగే ఐసిసి ట్వంటీ-20 ప్రపంచ కప్‌ను ఏప్రిల్ 30 నుంచి మే 16వ తేదీల మధ్య నిర్వహించాలని ఐసిసి నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu