గ్యారీ సోబెర్స్ సన్మాన కార్యక్రమంలో సునీల్ గవాస్కర్!
లెజండ్రీ, వెస్టిండీస్ ఆల్-రౌండర్ సర్ గ్యారీ సోబెర్స్‌ను సన్మానించే కార్యక్రమానికి భారతీయ స్టార్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హాజరు కానున్నారు. "గుర్తుంచుకోదగిన వీరుడు" (Knight to Remember) అనే పేరిట జరుగనున్న ఈ కార్యక్రమంలో వెస్టిండీస్ క్రికెట్ లెజండ్లు వెస్ హాల్, వివియన్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా కెప్టెన్ ఇయాన్ ఛాపెల్‌లు తదితరులు పాల్గొంటారు.టోనీ ఆధ్వర్యంలో మే 15వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో 73 సంవత్సరాల గ్యారీ సోబర్స్ ఆటతీరుపై క్రికెట్ లెజండ్లు ప్రసంగించనున్నారు.ఇకపోతే... 93 టెస్టుల్లో ఆడిన సోబెర్స్, 8032 పరుగులు, 235 వికెట్లు సాధించిన ఆల్‌రౌండర్‌గా నిలవడం గమనార్హం. అలాగే సోబెర్స్‌ను సన్మానించే ఈ కార్యక్రమం.. కరేబియన్ గడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ఫైనల్ రోజునే జరగడం మరో విశేషం.