వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ బ్రయాన్ లారా క్రికెట్ మనుగడ కోల్పోతుందని వ్యాఖ్యానించాడు. ట్వంటీ- 20 క్రికెట్‌తో క్రికెట్‌కు కొత్త జీవం వచ్చినట్లయిందని చెప్పాడు. క్రికెట్ మనుగడ కోసం ట్వంటీ- 20 అవసరమని తెలిపాడు. ట్రినిడాడ్‌లో జరిగిన ఓ సదస్సులో లారా మాట్లాడుతూ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చాడు.
ట్వంటీ- 20 క్రికెట్‌లో ఉత్కంఠ ఉంటుందని, అందువలన ఈ తరహా క్రికెట్ ఆదరణ పొందుతోందని పేర్కొన్నాడు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడిన రెండు సీజన్‌ల్లో లారా 400 పరుగులు సాధించాడు. ట్వంటీ- 20 క్రికెట్‌లో ప్రతి బంతిని బయటకు పంపేందుకు కాకుండా, ఆకర్షణీయ షాట్లను ఎంపిక చేసుకోవాలని బ్యాట్స్‌మెన్‌కు లారా సూచించాడు.