అంతర్జాతీయ క్రికెటర్లకు భద్రత కల్పించే విషయంపై తామెలాంటి గ్యారెంటీ ఇవ్వలేమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అభిప్రాయపడింది. ఉగ్రవాదుల దాడులు ఎపుడైనా, ఎక్కడైనా జరుగవచ్చని ఐసిసి చీఫ్ హరూన్ లోర్గాట్ తెలిపారు. దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ వచ్చే 2011 ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనే క్రికెటర్లకు ఐసిసి భద్రత కల్పించలేదన్నారు.
ఈ పోటీలను నిర్వహించే దేశాలే క్రికెటర్లకు భద్రత కల్పించాల్సి ఉంటుందన్నారు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై ఐసిసి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ దాడిలో ఆరుగురు క్రికెటర్లు గాయపడగా, ఐదుగురు భద్రతా సిబ్బంది మృత్యువాత పడ్డారు. కాగా, ఈ దాడుల్లో గాయపడిన సైమన్ టౌఫెల్, స్టీవ్ డెవిస్‌లకు మరింత సమయం కావాలన్నారు.